![]() |
![]() |

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ఈ రియాలిటీ షో గ్రాండ్ లాంచ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐతే హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లు ఎవరు అనే విషయం మీద ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది . ఈ నేపథ్యంలో సీరియల్ నటులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, జబర్దస్త్ కమెడియన్ల పేర్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా ‘గుండెనిండా గుడిగంటలు’ సీరియల్ ఫేమ్ బాలు అలియాస్ విష్ణుకాంత్ పేరు కూడా బాగా వినిపిస్తోంది. అయితే ఈ వైరల్ న్యూస్ కి చెక్ పెడుతూ ఒక వీడియోని రిలీజ్ చేసి అసలు విషయాన్నీ రివీల్ చేసాడు బాలు అలియాస్ విష్ణుకాంత్ .
ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియోలో విష్ణుకాంత్ మాట్లాడుతూ.. తాను ‘గుండెనిండా గుడిగంటలు’ సీరియల్‌ను వదిలేసి బిగ్‌బాస్ సీజన్ 10కి వెళ్తున్నానంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని చెప్పాడు. ఈ పోస్టులు, రీల్స్ తాను కూడా చూశానని, వాటికి వేలాది కామెంట్లు వచ్చాయని తెలిపాడు. సీరియల్ నుంచి వెళ్లొద్దంతో ఫాన్స్ అంతా సోషల్ మీడియాలో అలాగే తనకు పర్సనల్ గా సందేశాలు పంపిస్తున్నారని చెప్పాడు. బాలు పాత్రలో తనను తప్ప మరొకరిని ఊహించుకోలేమంటూ ప్రేక్షకులు చూపించిన ప్రేమ తనను కదిలించిందని తెలిపాడు.
అయితే తాను బిగ్‌బాస్‌కి వెళ్లడం లేదని విష్ణుకాంత్ క్లియర్ గా చెప్పేసాడు . బాలు పాత్రలోనే ఆడియన్స్ ని అలరిస్తానని , ఎంటర్‌టైన్ చేస్తానని చెప్పాడు. ఇప్పటివరకు సీరియల్‌కు అందించిన సపోర్ట్ ని ఇకముందు కూడా అందించాలని అభిమానులను కోరాడు. దీంతో బిగ్‌బాస్ సీజన్ 10 కంటెస్టెంట్ల లిస్ట్ లో విష్ణుకాంత్ పేరు మాత్రం లేదన్న విషయంపై క్లారిటీ వచ్చేసింది . ప్రస్తుతం ‘బాలు’ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
![]() |
![]() |